W.G: పెంటపాడులోని భూసమస్యలపై ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 6 వరకు గ్రామ సభల ద్వారా అర్జీలు స్వీకరించనున్నట్లు తహసీల్దార్ ఎం. సునీల్ కుమార్ తెలిపారు. సోమవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని ఆయా గ్రామాల్లోని వీఆర్వోలు, వీఆర్ఏలు ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు.