కోనసీమ: జిల్లాలో ఇద్దరు ఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఇవాళ సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. రాజోలు ఎస్సైగా ఆర్.మల్లికార్జున రెడ్డి, అంబాజీపేట ఎస్సై గా షేక్ సుభానిను నియమించామని ఆదేశాలలో పేర్కొన్నారు. రాజోలు ఎస్సై రాజేష్ కుమార్, అంబాజీపేట ఎస్సై కె.చిరంజీవిని వీఆర్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.