‘ధురంధర్ 2’ చిత్రంపైన వస్తున్న విమర్శలపై నటుడు అనుపమ్ ఖేర్ ఘాటుగా స్పందించాడు. ఇది కేవలం ప్రచారం మాత్రమే కాదని, సినిమా బాగుంటేనే థియేటర్లు హౌస్ఫుల్ అవుతాయని పేర్కొన్నాడు. ‘ప్రజలు అమాయకులు కారు, చిత్రం నచ్చితేనే చూస్తారు. అనవసరంగా విమర్శించే వారి గురించి ఆలోచించి సమయం వృథా చేయొద్దు. సినిమాను విమర్శించే వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’ అంటూ ఆయన చురకలంటించాడు.