CTR: చిత్తూరు జిల్లా పోలీస్ విభాగంలో మార్చి నెలలో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. పోలీస్ గెస్ట్ హౌస్లో నిర్వహించిన కార్యక్రమంలో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 22 సంవత్సరాలపాటు అంకితభావంతో సేవలందించడం అభినందనీయం అని కొనియాడారు.