MBNR: జిల్లాలో ఏప్రిల్ 1 నుండి 10వ తేదీ వరకు నిర్వహించనున్న “ఇంటింటికి సీపీఐ” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బాలకిషన్ పిలుపునిచ్చారు. జిల్లా కార్యాలయంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ క్రమంలో మాట్లాడుతూ.. ప్రస్తుత దేశ పరిస్థితుల్లో కమ్యూనిస్టులు బలోపేతం కావాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు.