E.G: గోపాలపురం నియోజవర్గం ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లి జిల్లా పరిషత్ పాఠశాలను రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్, మండల టీడీపీ అధ్యక్షులు లంక సత్యనారాయణ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాలు పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు పాటించి మెనూ ప్రకారం విద్యార్థులకు బోజన అందించాలని సూచించారు.