ఆసిఫాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పాఠకులకు ఉపయోగపడే విధంగా పుస్తకాల విరాళల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ పరీక్షల సహాయ అధికారి మర్యాల ఉదయ బాబు గ్రంథాలయానికి మొత్తం 70 పుస్తకాలను మంగళవారం విరాళంగా అందజేశారు. ఈ పుస్తకాలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.