KRNL: మద్దికేర మోడల్ స్కూలు నుంచి నీట్ కోచింగ్కు జోనల్ స్థాయిలో ఏడుగురు విద్యార్థినులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ నాగరాజు మంగళవారం తెలిపారు. చిత్తూరు జిల్లా శాంతిపురంలో వారికి ఉచితంగా కోచింగ్, స్టడీ మెటీరియల్, వసతి కల్పించనున్నట్లు చెప్పారు. ఈ విజయంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.