సత్యసాయి: సామాజిక అంశాలపై చైతన్యం కోసం హిందూపురం నుంచి అమరావతి వరకు 713 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసిన బోయ మంజునాథ్‌ను పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఈ సందర్భంగా యాత్ర విశేషాలను అడిగి తెలుసుకున్న మంత్రి, మంజునాథ్ ప్రయత్నాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.