స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.1390 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా కర్ణాటకలో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి హిందీ చిత్రంగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అలాగే, అత్యధిక వసూళ్లు చేసిన టాప్ భారతీయ చిత్రాల జాబితాలో, గతంలో నాలుగో స్థానంలో ఉన్న ‘ధురంధర్ 1’ (రూ.1350 కోట్లు) రికార్డును దాటేసింది.