AP: నెల్లూరులోని VR హైస్కూల్లో అత్యాధునిక డైనింగ్ హాల్‌ను మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆయన, మధ్యాహ్న భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం ఒకేసారి 400 మంది భోజనం చేసేలా ఉన్న ఈ సదుపాయాన్ని, భవిష్యత్తులో 800 సీట్లకు పెంచుతామని ప్రకటించారు.