ATP: గుత్తి మండలం పూలకుంట కంకర మిషన్ వద్ద లక్ష్మి అనే మహిళను ఆమె భర్త శివలింగప్ప రాళ్లతో కొట్టి అతి దారుణంగా హత్య చేశాడు. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. గుంతకల్లు మండలం మైనాపురానికి చెందిన శివలింగప్ప తొలుత భార్యను కదిరిపల్లిలోని తన సోదరి ఇంటికి తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.