MDK: తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఎర్లీ బర్డ్ స్కీమ్ సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నుంచి ఏప్రిల్ 30 వరకు ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద ఇంటి పన్ను చెల్లింపులు చేసి 5 శాతం రాయితీ పొందాలని కమిషనర్ సూచించారు. పన్నులపై పెనాల్టీల భారం నుంచి ఉపశమనం పొందాలని పేర్కొన్నారు.