GDWL: మహాలక్ష్మి పథకం మహిళలకు భరోసా కల్పిస్తూ వారి ఆర్థిక భారాన్ని తగ్గించి సాధికారతను పెంపొందిస్తుందని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. మంగళవారం ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా 290 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగి రూ.10వేల కోట్ల ప్రయాణ ఛార్జీలు మహిళలకు ఆదా అయ్యాయన్నారు.