BDK: గ్రంథాలయాలు ప్రత్యక్ష దేవాలయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి అభిప్రాయపడ్డారు. జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని మంగళవారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయం ఛైర్మన్ పసుపులేటి వీరబాబుతో ఆమె జిల్లాలోని గ్రంథాలయాల పనితీరుపై ముచ్చటించారు. అనంతరం గ్రంథాలయంలోని సదుపాయాలను పరిశీలించారు.