KNR: పెగడపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం మామిడి తోటలను ఉద్యానవన శాఖ అధికారి అనిల్ పరిశీలించారు. భారీగా వీచిన ఈదురుగాలు, వర్షానికి మామిడికాయలు రాలి రైతులకు తీవ్ర నష్టం జరిగిన నేపథ్యంలో హార్టికల్చర్ ఏఈవో అనిల్ మామిడి తోటలను పరిశీలించారు. ల్యాగలమర్రి, ఐతుపల్లి, ఆరవల్లి గ్రామాల్లో రాలిన మామిడికాయలను రైతులతో కలిసి పరిశీలించారు.