PPM: గుమ్మలక్ష్మీపురంలో జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు టీనేజ్ ప్రెగ్నెన్సీ నివారణపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, చిన్న వయస్సులో గర్భధారణ ఆరోగ్యం, విద్యపై ప్రభావం చూపుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 526 మంది విద్యార్థులు పాల్గొన్నారు.