KDP: లింగాల మండలం రామట్ల పల్లె గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరాన్ని పులివెందుల వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ అమర్నాథ్ రెడ్డి పశు వైద్యశాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి మంగేష్ పశువులకు నట్టల నివారణ మందు పంపిణీ, పశువులకు గర్భ పరీక్షలు నిర్వహించారు. వందలాది గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు తాపించారు.