KRNL: ఎమ్మిగనూరు YWCS చేనేత సహకార సంఘం ఉత్పత్తులను ఆప్కో ద్వారా మార్కెటింగ్ చేయాలనే నిర్ణయానికి ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ అంశంపై YSR కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు తప్పుడు ప్రచారమని సమతా సైనిక్ దళ్ నాయకుడు రంగయ్య తెలిపారు. ఈ నిర్ణయంతో అమ్మకాలు పెరిగి, కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఇది విలీనం కాదని స్పష్టం చేశారు.