SRCL: మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు. సిరిసిల్లలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ అధికారులు జిల్లా సంక్షేమ శాఖ అధికారులు మంగళవారం వేడుకలు నిర్వహించగా ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కాసేపు మహిళలతో ముచ్చటించి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే ఈ పథకం ఉద్దేశం అన్నారు.