మెసొపొటేమియా వారు 60 అంకెల గణితం ఆధారంగా గంటను 60 నిమిషాలుగా విభజించారు. అంతకుముందే ఈజిప్షియన్లు రోజును పగలు, రాత్రిగా చెరి 12 గంటలుగా విభజించి కాలగణనానికి పునాది వేశారు. కచ్చితమైన సమయం కోసం ఈ రెండు పద్ధతులను కలిపి ప్రపంచవ్యాప్త కాలమాన వ్యవస్థను రూపొందించారు. అదే నేటికీ మనం వాడుతున్న గంటలు, నిమిషాల పద్ధతిగా స్థిరపడింది.