ATP: అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన జాబ్ అచ్చీవర్స్ డే కార్యక్రమంలో MLA దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు నియామక పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. సీఎం చంద్రబాబు విజన్ 2047 ప్రకారం యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. తాను కూడా పాలిటెక్నిక్ విద్యార్థినేనని పేర్కొన్నారు.