NDL: ఈనెల 10న రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు ఇవాళ సీపీఐ నాయకుడు రంగం నాయుడు తెలిపారు. కొలిమిగుండ్ల మండలంలోని రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ పొల్యూషన్ వల్ల రైతుల పంటలు దెబ్బ తినడంతో రైతులు భారీగా నష్టపోయారు. రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వారు రైతులకు నష్టపరిహారం ఇచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన అన్నారు.