ADB: జిల్లాలోని పలు ప్రదేశాల్లో తరచుగా జరుగుతున్న ప్రమాదాల రీత్యా సూచిక బోర్డులను ఏర్పాటు చేయటం జరుగుతుందని SP అఖిల్ మహాజన్ తెలిపారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా తాంసి మండలం పొన్నారి గ్రామంలో ఏర్పాటు చేసిన సూచిక బోర్డును DSP జీవన్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేశారు. సూచిక బోర్డులను ఏర్పాటు చేసి ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం జరిగిందని తెలిపారు.