KDP: దువ్వూరు మండలం చల్ల బసాయపల్లిలో మొక్కజొన్న పంటను కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పరిశీలించారు. మొక్కజొన్న రైతులతో ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్న, అరటి రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. మొక్కజొన్న మద్దతు ధర రూ. 2400 ఉంటే రేటు రూ. 1400కి అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం స్పందించాలని ఎంపీ డిమాండ్ చేశారు.