JN: జఫర్గడ్(M) ముగ్ధం తండాలో ఇవాళ సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ రహదారి పనులను సర్పంచ్ లక్పతి నాయక్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు.