ELR: పాఠశాలలో అందించు మధ్యాహ్న భోజనం పూర్తి నాణ్యతగా, రుచికరంగా ఉండాలని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. పిప్పర జడ్పీ హైస్కూల్లో అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని మంగళవారం ఎమ్మెల్యే ధర్మరాజు తనిఖీ నిర్వహించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, హెచ్ఎం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.