TG: ఏపీ ప్రభుత్వానికి మంత్రి జూపల్లి కృష్ణారావు వార్నింగ్ ఇచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టులో వాటర్ లెవల్స్ తగ్గాయని, విద్యుదుత్పత్తి నిలిపివేయాలనే నిబంధన ఉందన్నారు. తాగడానికి కూడా నీళ్లు లేకుండా చేస్తారా? తాము ధర్నా చేస్తామనే వరకు నీళ్లు దోచుకుందన్నారు. తాగునీటి అవసరాల కోసం మాత్రమే నీటిని వాడాలని, ప్రాజెక్టులో 64% TG వాటా ఉందన్నారు. ఏపీ అక్రమంగా నీటిని వాడుకుంటోందని మండిపడ్డారు.