SRCL: ప్రజలకు పోలీస్ సేవలు చేరువయ్యేలా విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ పక్కాగా అమలు చేయాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. ఎల్లారెడ్డిపేటలోని పోలీస్ స్టేషన్ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, రికార్డులను పరిశీలించారు. కేసుల దర్యాప్తులో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా పెండింగ్లో పెట్టకుండా పూర్తి చేయాలన్నారు.