KRNL: తుగ్గలి మండలం ముక్కెళ్ల గ్రామానికి రేపు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ రానున్నట్లు టీడీపీ మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు ఇవాళ తెలిపారు. గ్రామంలో రూ.47 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.