ADB: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఈనెల 28న చలో హైదరాబాద్ కార్యక్రమానికి బయలుదేరిన ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయటం సరైనది కాదని BRTU జిల్లాధ్యక్షురాలు సరస్వతి అన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం సోనాల మండలంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. న్యాయమైన హామీలను పరిష్కరించాలని కోరారు.