కోనసీమ: ప్రాణాలు నిలుపుకునేందుకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణాలు సాగించాలని మండపేట రూరల్ సిఐ పీ.దొరరాజు విజ్ఞప్తి చేశారు. కపిలేశ్వరపురంలో హెల్మెట్ వినియోగం, రోడ్డు భద్రత, సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంగర ఇన్ఛార్జ్, ఎస్సై ఎం.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.