HNR: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 62వ డివిజన్ సోమిడి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్యాధికారి ప్రదీప్ రెడ్డి, డాక్టర్ అనిత పాల్గొన్నారు.