VZM: బొండపల్లి మండలంలోని రయంద్రం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. పైడితల్లి అమ్మవారి వనం గుడి వద్ద గల వెదురుపాదలు కాలిపోవడంతో సుమారు రూ.10 వేల ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే గజపతినగరం అగ్నిమాపక కేంద్రం అధికారి ఎం.ఎస్.వీ రవి ప్రసాద్ సిబ్బందితో వెళ్లి మంటలను అదుపు చేశారు.