NTR: జక్కంపూడిలో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల పంపిణీ జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యేలు బోండా ఉమా, రామ్మోహన్ పాల్గొన్నారు. మొత్తం 2,256 ఇళ్లను అందజేశారు. సొంతిల్లు ప్రతి కుటుంబ కల అని పేర్కొన్నారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలు ముందుకెళ్లాలని సూచించారు. మిగిలిన ఇళ్లను త్వరలో పూర్తి చేసి అందజేస్తామన్నారు.