PPM: సాలూరు డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ పాల్గొన్నారు. బాల్య వివాహాలు పూర్తిగా నిషేధితమని, 18 సంవత్సరాల లోపు అమ్మాయిల వివాహం చట్ట విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి వివాహాలు పిల్లల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.