AP: అనంతపురం జిల్లా గుత్తి మండలంలో గ్యాస్ సిలిండర్ గొడవ ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. మూడు నెలలుగా కట్టెల పొయ్యిపై వంట చేస్తూ ఇబ్బంది పడుతున్న మహాలక్ష్మి, భర్త ఖాళీ చేతులతో రావడంతో మనస్తాపం చెంది ఫినాయిల్ తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.