విజయనగరం జిల్లాలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిన్నటి వరకు ఎండలు మండగా సోమవారం ఉదయానికి వాతావరణం ఒక్కసారిగా మారడంతో జొన్న రైతులు పంటను కాపాడుకునేందుకు పనులు వేగవంతం చేశారు. పానశాలవలసలో రైతులు మొక్కజొన్న పిక్కలపై పరదాలు వేసి కప్పుతూ కనిపించారు.