తిరుమలలో ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 1 వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. వసంతమండపంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. స్వామివారిని నిత్యం మాడవీధుల్లో ఊరేగిస్తారు. రేపు స్వర్ణరథంపై శ్రీవారి తిరువీధిని చూసేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలతో పాటు రేపటి అష్టదళ పాద పద్మారాధన సేవను TTD రద్దు చేసింది.