NZB: జిల్లా కేంద్రంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ యువకుడు ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతదేహంగా కనిపించాడు. సదరు యువకుడిని గుర్తుతెలియని వ్యక్తి గొడ్డలితో మెడపై దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హతుడు అక్బర్ బాగ్ ప్రాంతానికి చెందిన అక్షయ్గా పోలీసులు గుర్తించారు.