KMM: ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం నేలకొండపల్లిలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. స్థానిక శ్రీకర గార్డెన్ ఫంక్షన్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్-అలైవ్’ (Arrive-Alive) పేరిట ఈ సదస్సు జరుగుతుందని ఎస్సై సంతోష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.