WG: పాలకొల్లు పెంకుళ్లపాడులో ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు సోమవారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం మంత్రి నిమ్మల రామానాయుడు టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. పేదల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం సాకారం చేసి చూపించిందని మంత్రి పేర్కొన్నారు.