NDL: బేతంచెర్ల సంజీవ్ నగర్లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో స్థానిక జట్టు ప్రథమ స్థానం సాధించింది. ప్యాపిలి జట్టు ద్వితీయ, గోనెగండ్ల తృతీయ, ఎం బాయ్ జట్టు నాలుగో స్థానాల్లో నిలిచాయి. విజేతలకు నగర పంచాయతీ ఛైర్మన్ చలం రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందజేశారు.