TG: శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేస్తున్న నిరసనలను కాంగ్రెస్ సభ్యులు ఖండించారు. తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతుండగా.. ఎమ్మెల్సీలు నిరసన చేయడం కరెక్ట్ కాదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. కీలకమైన బిల్లుపై చర్చ జరుగుతుండగా.. ఆందోళన చేయడంపై మండిపడ్డారు. బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత ఆందోళన చేసుకోవచ్చని సూచించారు.