దేశవ్యాప్తంగా హైకోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలకు బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని మైసూరుకు చెందిన శ్రీనివాస్ లూయిస్గా గుర్తించారు. తన భార్యతో ఉన్న గొడవల కారణంగా ఆమెను ఇరికించాలనే ఉద్దేశంతో.. ఆమె పేరు మీద ఉన్న ఇమెయిల్ ఐడిని ఉపయోగించి శ్రీనివాస్ ఈ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలింది.