SRPT: మునగాల మండలం ముకుందాపురం గ్రామ శివారులో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట నుంచి కోదాడ వైపు మాంసపు వ్యర్ధాలతో వెళ్తున్న టాటా ఏసీ వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనంలోని వ్యర్థాలు రోడ్డుపై పడటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతుంది. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.