WGL: పర్వతగిరి మండలం టూక్య తండా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పోశాల చంద్రశేఖర్ (46) గుండెపోటుతో మృతి చెందాడు. ఇవాళ పాఠశాల విధుల్లో ఉండగానే అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. మృతుడి స్వస్థలం సంగెం మండలం కాట్రపల్లి గ్రామం, ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు.