MDK: తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. అనుమానాస్పద లింకులు, తప్పుడు కాల్స్‌ను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఇటువంటి మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు.