MLG: ములుగు మండలం బండారుపల్లిలోని పీఎంశ్రీ టీజీఎంఎస్ & జూనియర్ కాలేజీలో వృత్తి విద్యా సమ్మర్ ఇంటర్న్షిప్ 2026 ప్రారంభమైంది. విద్యార్థులు ఈ ఇంటర్న్షిప్ ద్వారా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రిన్సిపాల్ దేవకి సూచించారు. ఈ ఇంటర్న్షిప్ ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొంది భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని వృత్తి విద్యా శిక్షకుడు సురేష్ తెలిపారు.