తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’లో సమంత నటిస్తోన్న మూవీ ‘మా ఇంటి బంగారం’. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం 2026 మే 15న విడుదల కావాల్సి ఉంది. అయితే, తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మే 1కి ముందుకు జరిపినట్లు సమాచారం. మే 1న విడుదల కావాల్సిన ‘లెనిన్’ సినిమా వాయిదా పడటంతో, ఆ డేట్ను మేకర్స్ లాక్ చేసినట్లు తెలుస్తోంది.